పెండ్లి పీటల పైనుంచి వరుడు పరార్.. చుట్టపాయనను పెండ్లాడిన వధువు..!
Bride married Guest: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ పట్టణంలో ఓ పెండ్లి వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ పట్టణంలో ఓ పెండ్లి వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సన్నాయి పాటలు, డీజే చప్పుళ్లతో పెండ్లి మండపం అంతా హడావిడిగా ఉన్నది. వధూవరుల తరఫు బంధువుల రాకతో ఫంక్షన్ హాల్ అంతా కళకళలాడుతున్నది. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వేదికపైకి వచ్చారు. తాళీ కట్టే సమయం రానే వచ్చింది. కానీ, పెండ్లి కూతురు మెడలో వరుడికి బదులుగా గెస్టుగా వచ్చిన మరో వ్యక్తి తాళి కట్టాడు.
సీని ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెండ్లి కొడుకుకు ఆ పెండ్లి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేకపోయాడు. అందుకే వేదిక మీదకు వచ్చి పీటలపై కూర్చున్నాడు. వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. తీరా తాళి కట్టే సమయానికి పెండ్లి కొడుకు మాయమయ్యాడు. కాసేపు అతని కోసం వెతికిన ఇరు కుటుంబాలవారు పెండ్లి ఇష్టం లేకనే అతను పారిపోయినట్లు తెలుసుకున్నారు.
వరుడు పారిపోయి వధువు ఒక్కతే పెండ్లి పీటలపై ఉండటాన్ని వధువు తరఫు బంధువులు అవమానంగా భావించారు. అందుకే ఇంతదాకా వచ్చిన పెండ్లిని ఆపకూడదనే ఉద్దేశంతో పెండ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా వధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. దాంతో ఓ వ్యక్తి పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు. దాంతో ఇరుకుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదికపై పెండ్లి జరిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

