Research | మన పూర్వీకులు అంతా ఒక్కరే కాదా? భిన్న జాతుల కలయికతోనే మనిషి అవతరించాడా?
Science | మనిషి కోతినుంచి పుట్టాడని చార్లెస్ డార్విన్ సూత్రీకరించాడు. ఆ కోతి జాతి ఆఫ్రికాలో మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమో సేపియన్స్ ఆఫ్రికాలోని ఒకే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ, ఈ సూత్రీకరణను తాజా పరిశోధన ఒకటి సవాల్ చేస్తున్నది.
Research | న్యూఢిల్లీ, మే 19: మనిషి కోతినుంచి పుట్టాడని చార్లెస్ డార్విన్ సూత్రీకరించాడు. ఆ కోతి జాతి ఆఫ్రికాలో మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమో సేపియన్స్ ఆఫ్రికాలోని ఒకే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ, ఈ సూత్రీకరణను తాజా పరిశోధన ఒకటి సవాల్ చేస్తున్నది. మనిషి పూర్వీకులు ఒకేజాతి కాదని, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలకు చెందిన వలస జాతుల మధ్య సంపర్కం ఏర్పడి నేటి మానవుడు అవతరించాడని తాజాగా పరిశోధకులు చెప్తున్నారు.
అతుకుల బొంత
మనిషి బతుకు అతుకుల బొంత అని పరిశోధకులు అంటున్నారు. మనిషి జన్యు నిర్మాణంలో అనేక వైరుధ్యాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జన్యు పరిశోధకులు బ్రెన్నా హెచ్ అంటున్నారు. మనిషి పూర్వీకులు ఒకేజాతివారా? భిన్న జాతుల కలయిక వల్ల మనిషి అవతరించాడా? అన్న అంశంపై ఆఫ్రికాలో పలువురు పరిశోధకులు దశాబ్దాలుగా పరిశోధన నిర్వహిస్తున్నారు. తాజాగా వీరి పరిశోధన వ్యాసం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాలకు చెందిన 290 మంది మానవుల జన్యు క్రమాలను వీరు విశ్లేషించారు. సియెర్రాలియోన్లోని మెండే ప్రాంతంలో నివసించే రైతులు, ఇథియోపియాలోని గుముజ్లో నివసించే వేటాడే సమూహాలు, అమ్హరా రైతులు, దక్షిణాఫ్రికాలోని నమా జాతి వేటగాళ్లు.. ఇలా అనేక భిన్న జాతులనుంచి నమూనాలు సేకరించి జన్యువులను విశ్లేషించారు. దీంతో ఇప్పటివరకూ భావిస్తున్నట్టు ఆఫ్రికాలోని ఒకే ఒక్క ప్రాంతం నుంచి ఆధునిక మానవుడు అవతరించలేదని, భిన్న ప్రాంతాల్లోని తెగల కలయిక వల్ల హోమో సేపియన్స్ అనే జాతి పుట్టిందని ప్రతిపాదించారు. ఒకరకంగా చెప్పాలంటే మనిషి జన్యుక్రమం ఒక అతుకుల బొంతలాంటిదని పేర్కొన్నారు. 10 లక్షల ఏండ్ల క్రితమే ఈ జాతుల కలయిక చోటుచేసుకొన్నదని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌కు చెందిన పాపులేషన్ జెనటిస్ట్ ఆరోన్ రగ్స్డేల్ తెలిపారు. ‘ఆధునిక మానవులకు హోమో సేపియన్స్ అనే ఒకే ఒక పూర్వీకులున్నారు. కానీ, మరింత లోతుగా వెళ్లి పరిశీలిస్తే హోమో సేపియన్స్కు అనేక జాతుల పూర్వీకులున్నారని తేలింది’ అని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

