చండీగఢ్: పార్కులో ఆడుకుంటున్న బాలుడు తుంటరి పని చేశాడు. తాడుతో కట్టిన ప్లాస్టిక్ వస్తువును గాలిలోకి విసిరాడు. అయితే పైనున్న హై వోల్టేజీ విద్యుత్ వైరుకు అది తగిలింది. (boy suffers fatal burns) దీంతో పెద్ద శబ్దంతోపాటు మంటలు వ్యాపించాయి. ఆ బాలుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఇది చూసి అక్కడున్న వ్యక్తులు షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ సంఘటన జరిగింది. 9 ఏళ్ల ఆరవ్ మూడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం వేళ పార్కులో ఆడుకున్నాడు. ఈ సందర్భంగా తాడుతో కట్టిన ప్లాస్టిక్ వస్తువును గాలిలోకి విసిరాడు.
కాగా, పార్క్ పైనుంచి వెళ్తున్న 66 కేవీ హైవోల్టేజీ విద్యుత్ లైన్‌కు ఆ ప్లాస్టిక్ వస్తువు తగిలింది. దీంతో పేలుడు వంటి శబ్దం రావడంతోపాటు తాడు పట్టుకున్న బాలుడికి మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో షాక్‌తో కిందపడిపోయాడు.
మరోవైపు ఇది చూసి అక్కడున్న వారు భయాందోళన చెందారు. భయంతో దూరంగా పారిపోయారు. ఆ తర్వాత ఆ బాలుడి వద్దకు కొందరు చేరుకున్నారు. తీవ్ర కాలిన గాయాలైన ఆరవ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అమృత్‌సర్‌లోని హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पंजाब के जालंधर में पार्क में खेलते-खेलते 66 केवी लाइन के करंट से झुलसा 9 साल का बच्चा।
जालंधर के गुरु नानकपुरा वेस्ट के झुग्गी झोपड़ी का 9 साल का आरव करंट लगने से झुलस गया। घटना सीसीटीवी में कैद हो गई।
सीसीटीवी में देखा जा सकता है कि जैसे ही बच्चे ने पार्क में खेलते हुए 66… pic.twitter.com/nQ0Ei3B1Yn
— Amit Pandey (@amitpandaynews) March 29, 2025