Monkeys Kill Boy | కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి.. బాలుడ్ని దారుణంగా చంపిన కోతులు
Monkeys Kill Boy | కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. (Monkeys Kill Boy) ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అహ్మదాబాద్: కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. (Monkeys Kill Boy) ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాల్కి గ్రామంలోని గుడి సమీపంలో పదేళ్ల దీపక్ ఠాకూర్ తన స్నేహితులతో కలిసి ఆడుతున్నాడు. ఇంతలో ఒక కోతుల గుంపు అతడిపై దాడి చేసింది. ఆ బాలుడి మీదకు దూకిన కోతులు గోళ్లతో ఆ చిన్నారి కడుపు చీల్చి పేగులను బయటకు తీశాయి.
కాగా, స్పందించిన స్థానికులు కోతుల దాడి నుంచి ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఆ గ్రామంలో జనంపై కోతులు దాడి చేయడం ఇది మూడో సంఘటన. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆగ్రహంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. కోతులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

