Teen drives with man on bonnet | బానెట్‌పై వ్యక్తితో కారు డ్రైవ్ చేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Teen drives with man on bonnet | కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక బాలుడు దానిని డ్రైవ్ చేశాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక బాలుడు దానిని డ్రైవ్ చేశాడు. (Teen drives with man on bonnet) ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు. ఆ కారు బానెట్‌పై ఒక వ్యక్తి ప్రమాదకరంగా పడుకొని ఉన్నాడు. మిగతా వాహనదారులు, రోడ్డుపై వెళ్లేవారు ఇది చూసి షాక్ అయ్యారు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు స్పందించారు. బాలుడు డ్రైవ్ చేసిన కారు బానెట్‌పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు. అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Watch: Mumbai Teen Drives Father's BMW On Busy Road With Man On Bonnet angry 😠 😡 👿 @MumbaiPolice pic.twitter.com/5B6vvcHJAN
— 𝓡𝓪𝓳 ᶦ–WᎥtness𒆜 (@BitmanRaj) May 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

