ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణానికి ఆన్లైన్ ఈ పాస్ విధానం

ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించిన ఈ పాస్ కోసం http://epassmsdma.mahait.org వైబ్‌సైట్‌ను గురువారం అందుబాటులోకి తెచ్చారు. పూర్తిగా టీకాలు తీసుకున్న వ్యక్తుల కోసం ఆఫ్‌లైన్ ధృవీకరణ ప్రక్రియను బీఎంసీ బుధవారం నుంచి ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ముంబై నగరంలోని 53 రైల్వే లోకల్ స్టేషన్లతోపాటు ముంబై మోట్రోపాలిటిన్ పరిధిని కలుపుకుని మొత్తం 109 స్టేషన్లలో టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఆఫ్‌లైన్ ధృవీకరణతోపాటు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు నెలవారీ పాస్‌లను జారీ చేయనున్నారు. ఇవి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారంలో ఏడు రోజులు రెండు షిఫ్ట్‌ల్లో పని చేస్తాయి.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆన్లైన్ ఈ పాస్‌తోపాటు ఆఫ్‌లైన్ విధానంలో కూడా నెలవారీ రైలు పాసులను ఇవ్వనున్నట్లు బీఎంసీ కమిషనర్ తెలిపారు. టీకా రెండో డోసు వేయించుకుని 14 రోజులు పూర్తయిన వారికి మాత్రమే నెలవారీ పాస్‌లను జారీ చేస్తామని చెప్పారు. దీని కోసం ఫొటోతో కూడిన టీకా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముంబైలో నిలిపివేసిన లోకల్ రైళ్లను ఆగస్ట్ 15 నుంచి పునరుద్ధరించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

