Suvendu Adhikari | మైనారిటీ మోర్చాను రద్దు చేయాలి.. బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్
Suvendu Adhikari | మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కోల్‌కతా: మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో మైనార్టీల మద్దతు లేకపోవడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలువలేకపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను తప్పనిసరిగా రద్దు చేయాలని అన్నారు.
కాగా, బీజేపీ నినాదమైన ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’కు స్వస్తి పలకాలని సువేందు అధికారి పిలుపునిచ్చారు.
‘హమ్ ఉంకే సాథ్ జో హమారే సాథ్’ (మనతో ఉన్న వారితో మేం ఉంటాం) అనే కొత్త నినాదాన్ని పార్టీ అనుసరించాలని సూచించారు. ‘నేను జాతీయవాద ముస్లింల గురించి కూడా మాట్లాడా. మేమంతా ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అని చెప్పాం. కానీ నేను ఇకపై ఇది చెప్పను. ఎందుకంటే ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ (మాతో ఉన్న వారితో మేం కలిసి ఉన్నాం) మైనారిటీ మోర్చా అవసరం లేదు’ అని అన్నారు.
మరోవైపు సువేందు అధికారి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్యానికి బీజేపీ వ్యతిరేకమని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సువేందు అధికారి తెలిపారు. దేశం, బెంగాల్ కోసం నిలిచే జాతీయవాదులతో బీజేపీ ఉండాలని తాను అన్నట్లు వివరించారు. ఈ మేరకు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

