ముంబై: లెన్స్‌కార్ట్ (Lenskart Store) కంటిఅద్దాల షాపులో డ్రెస్ కోడ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లెన్స్‌కార్ట్‌లో పనిచేస్తున్న హిందువులు బొట్టు కానీ, బిందీ కానీ పెట్టుకోవద్దు అని ఇటీవల ధిక్కత్ జారీ చేశారు. పెళ్లి అయిన ఆడవాళ్ల మంగళసూత్రం ధరించరాదన్నారు. హిందువులు చేతులకు కంకణాలు కూడా కట్టుకోవద్దు అని ఆదేశించారు. అయితే ముస్లింలు మాత్రం హిజాబ్ ధరించవచ్చు అని డ్రెస్‌కోడ్ రిలీజ్ చేశారు. లెన్స్‌కార్ట్ వైఖరిని ఖండిస్తూ ముంబైలోని ఓ స్టోర్‌లోకి బీజేపీ మహిళా ముస్లిం నేత దూసుకెళ్లింది. ఆ స్టోర్‌లో పనిచేస్తున్న హిందువులకు తిలకం దిద్దింది. బొట్టు పెట్టింది. కొందరికి కంకణాలు కట్టింది.
బీజేపీ నేత నజియా ఇలాహి ఖాన్.. ముంబైలోని ఓ లెన్స్‌కార్ట్ స్టోర్‌కు వెళ్లి అక్కడి ఫ్లోర్ మేనేజర్ మోషిన్ ఖాన్‌తో వాగ్వాదానికి దిగింది. బిందీపై బ్యాన్ విధించడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇది హిందూ దేశం, ఓనర్ క్షమాపణలు చెప్పకపోతే లెన్స్కార్ట్ను బహిష్కరిస్తామని ఆమె అన్నారు. లెన్స్‌కార్ట్ సీఈవో పీయూష్ బన్సల్ రియాక్ట్ అవుతూ.. తమ డ్రెస్ కోడ్ ఆదేశాలు చాలా పాతవి అని, ఇప్పుడు ఆ నియమావళిని మార్చినట్లు చెప్పారు.
BJP Leader Nazia Elahi Khan confronted staff at a Lenskart store in Mumbai over alleged discriminatory grooming policies.
She was seen applying tilak to Hindu staff & raising “Jai Shri Ram” slogans. pic.twitter.com/JRiTFkH1bx
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 20, 2026