Bengaluru Airport: బెంగుళూరు విమానాశ్రయంలో నమాజ్ .. కర్నాటక ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ
Bengaluru Airport : కెంపగౌడ విమానాశ్రయంలో ఓ ముస్లింల బృందం నమాజ్ చేసిన ఘటన వివాదాస్పదం అవుతున్నది. కర్నాటక రాష్ట్ర బీజేపీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
బెంగుళూరు: బెంగుళూరులోని కెంపగౌడ విమానాశ్రయం(Bengaluru Airport)లో ఓ ముస్లింల బృందం నమాజ్ చేసిన ఘటన వివాదాస్పదం అవుతున్నది. కర్నాటక రాష్ట్ర బీజేపీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. కెంపగౌడ విమానాశ్రయంలోని టర్మినల్-2లో ఈ ఘటన చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఓ గ్రూపు నమాజ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న సెక్యూర్టీ సిబ్బంది నిశ్చేష్టులిగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. హై సెక్యూర్టీ ఉన్న ఎయిర్‌పోర్టులో ఎలా ఇలాంటి ఘటన జరిగిందో సీఎం సిద్ధరామయ్య, ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే వివరణ ఇవ్వాలని బీజేపీ ప్రతినిధి విజయ ప్రసాద్ తెలిపారు.
హై సెక్యూర్టీ జోన్లో నమాజ్ చేయడానికి ముందు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని బీజేపీ నేత ప్రశ్నించారు. పర్మిషన్ తీసుకుని ఆర్ఎస్ఎస్ పాత సంచాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రభుత్వం వ్యతిరేకించిందని, కానీ నిషేధి ప్రాంతాల్లో ప్రార్థనలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకున్నదని ఆయన అడిగారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. టర్మినల్ 2 వద్ద భారీ సెక్యూర్టీ ఉంటుందని, కానీ పోలీసులు ఆ గ్రూపును అడ్డుకోలేకపోయారని, ఓ వర్గం పట్ల ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?
Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?
Why is it… pic.twitter.com/iwWK2rYWZa— Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

