హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ… పోలింగ్ బూత్‌లో అడ్డుకున్న బీజేపీ కార్యకర్త
చెన్నై: హిజాబ్ ధరించిన ముస్లిం మహిళను పోలింగ్ బూత్‌లో బీజేపీ కార్యకర్త అడ్డుకున్నాడు. ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను ఇబ్బంది పెట్టాడు. ముస్లిం మహిళ హిజాబ్ తీసివేయాలంటూ అతడు హల్చల్ చేశాడు. తమిళనాడులోని మధురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధురైలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళను అక్కడున్న బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుడు ఇబ్బంది పెట్టాడు. ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. హిజాబ్ తీసివేయాలంటూ గట్టిగా కేకలు వేసి హంగామా సృష్టించాడు.
కాగా, ఆ పోలింగ్ బూత్‌లో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు వెంటనే జోక్యం చేసుకున్నారు. బీజేపీ సభ్యుడి తీరును వారు ఖండించారు. ఇంతలో పోలీసులు కలుగజేసుకున్నారు. బీజేపీ సభ్యుడ్ని పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపారు. దీంతో ఆ ముస్లిం మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందించారు. బీజేపీ ఎప్పటి నుంచో ఇలాంటివి చేస్తోందని విమర్శించారు. వీటికి తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని తిరస్కరించాలో తమిళనాడు ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు.
మరోవైపు సుమారు 11 ఏండ్ల తర్వాత ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాల్టీలు, 490 పంచాయతీల్లోని 12,607 స్థానాలకు శనివారం ఒకే దశలో పొలింగ్ నిర్వహించారు.
#TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH
— ANI (@ANI) February 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

