Watch: బీజేపీ ఎమ్మెల్యే చెంపపై కొట్టిన న్యాయవాది.. వీడియో వైరల్
BJP MLA Gets Slapped | బీజేపీ ఎమ్మెల్యే చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ న్యాయవాదిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: బీజేపీ ఎమ్మెల్యే చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. (BJP MLA Gets Slapped) దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ న్యాయవాదిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు.
కాగా, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై దాడికి స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యోగేష్ వర్మ మద్దతుదారులు ఆ న్యాయవాదిపై ప్రతి దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps
— IANS (@ians_india) October 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

