ZEE Dispute | ఇన్వెస్కోకు భారీ షాక్.. జీ ఏజీఎం డిమాండ్‌పై నిషేధం..!
Zee Dispute | జీ ఎంటర్టైన్మెంట్ అసాధారణ ఏజీఎం నిర్వహించాలన్న డిమాండ్‌ను ఇన్వెస్కోను బాంబే హైకోర్టు నిషేధించింది.

ZEE Dispute | జీ ఎంటర్టైన్మెంట్లో అతిపెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్కోకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాటాదారులతో జీ అసాధారణ వార్షిక సమావేశం నిర్వహించాలన్న ఇన్వెస్కో డిమాండ్‌ను న్యాయస్థానం నిషేధించింది. చైనా సంస్థల మద్దతుతో ఇన్వెస్కో పని చేస్తున్నది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ అతిపెద్ద ఇన్వెస్టర్లు. ఈ రెండు సంస్థలు జీ అసాధారణ ఏజీఎం నిర్వహించాలని, ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకాను, డైరెక్టర్లు అశోక్ కురియన్, మనీష్ చొఖానీలను తొలగించాలని కోరుతూ గత నెల 11న కంపెనీకి నోటీసులు ఇచ్చాయి. అయితే, ఇన్వెస్కో ప్రతిపాదన నిష్ఫలమైందని పేర్కొంటూ ఇప్పటికే కురియన్, చొఖానీలు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.
ఆరుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్ల కోసం ఇన్వెస్కో పట్టు
ఇంకా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లుగా సురేంద్ర సింగ్ సిరోహి, నైనా కృష్ణమూర్తి, రోహన్ ధామిజా, అరుణా శర్మ, శ్రీనివాసరావు అడెపాటి, గౌరవ్ మెహతాలను నియమించాలని ఇన్వెస్కో డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన జీ ఎంటర్టైన్మెంట్.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇన్వెస్కో నోటీసు చట్టవిరుద్ధం, నిరుపయోగం అని ప్రకటించాలని కోరింది.
ఎండీ కం సీఈవో లేకుండా కంపెనీ పని చేయలేదు..
దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతవారం తీర్పును రిజర్వు చేసింది. పునీత్ గోయెంకా తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఒకవేళ పునీత్ గోయెంకాను తొలగిస్తే సంస్థ బోర్డు డైరెక్టర్లు, ఎండీ-సీఈవో లేకుండా పని చేయలేవని వాదించారు. జీ వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర కూడా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్వెస్కో నిజమైన, యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

