Z Category Security | వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అప్నాదళ్ (ఎస్) నేత, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు తెలుస్తున్నది. అంతకుముందు ఆమెకు వై కేటగిరీ భద్రత ఉండేది. ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ ఆమె భద్రతను జెడ్ కేటగిరీకి పెంచింది. జెడ్ కేటగిరీలో 22 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో నలుగురు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు ఉంటారు. ఈ భద్రతను ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తారు. భద్రతను పెంచుతూ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, అనుప్రియ పటేల్ భద్రత పెంపుపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.