Kurla accident : మహారాష్ట్ర (Maharastra) లోని కుర్లా (Kurla) లో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్‌కు బస్సు నడిపిన అనుభవం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు నడిపిన డ్రైవర్ ‘బ్రుహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (BEST)’లో ఎనిమిది రోజుల క్రితమే కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరినట్లు సమాచారం. అంతకుముందు అతనికి కేవలం కారు నడిపిన అనుభవం మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
బస్సు నడపడం రాని వ్యక్తిని ప్రజా రవాణా బస్సుకు డ్రైవర్‌గా నియమించి ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన ‘బెస్ట్’ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.
#WATCH #Mumbai #KurlaBusAccident Tragic accident: BEST bus #332 (Kurla-Andheri route) Royal Hotel, Kurla. 4 dead, 20 injured after bus collides with multiple vehicle #CCTV FOOTAGE #HarryPotter#MohammedShami #जयाकिशोरी #Syria #PushpaTheWildFire
Allahabad#bombblast pic.twitter.com/0PYNv6DMm0— Rahul (@Rahularodia) December 10, 2024