లగేజీని కనుగొనేందుకు… ఇండిగో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన వ్యక్తి
బెంగళూరు: మారిపోయిన లగేజీని కనుగొనేందుకు ఒక వ్యక్తి ఏకంగా ఇండిగో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నందన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 27న పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. అయితే ఆయన బ్యాగ్ తారుమారైంది. తన బ్యాగ్‌ను పోలినట్లుగా ఉన్న బ్యాగ్‌ను నందన్ కుమార్ తన ఇంటికి తీసుకెళ్లగా, ఆయన బ్యాగ్‌ను మరో వ్యక్తి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తర్వాత నందన్ భార్య ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్‌ను నందన్ కుమార్ సంప్రదించాడు. బ్యాగ్‌లు తారుమారైన విషయాన్ని చెప్పాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్ ఇవ్వాలని కోరాడు.
అయితే నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి ఫోన్ నంబర్ ఇవ్వడం కుదరదని ఇండిగో కస్టమర్ కేర్ సిబ్బంది నందన్ కుమార్‌కు తెలిపారు. ఆయనను కాంట్రాక్ట్ చేసి తిరిగి ఫోన్ చేస్తామని చెప్పారు. ఆ మరునాడు కూడా ఇండిగో కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సమస్యను తానే పరిష్కరించు కోవాలని నందన్ కుమార్ నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌పై సంబంధిత ప్రయాణికుడి పీఎన్ఆర్ ద్వారా ఇండిగో వెబ్సైట్ నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. చెక్ ఇన్, ఎడిట్ బుకింగ్, కాంటాక్ట్ అప్డేట్ వంటివి ప్రయత్నించాడు.
ఫలితం లేకపోవడంతో ఇండిగో వెబ్సైట్ హ్యాకింగ్‌కు నందన్ కుమార్ ప్రయత్నించాడు. డెవలపర్ కన్సోల్ కోసం కంప్యూటర్‌పై ఎఫ్12 ప్రెస్ చేశాడు. అందులోని ప్రొగ్రామ్‌ను అంతా పరిశీలించిన తర్వాత సహ ప్రయాణికుడి మొబైల్ నంబర్‌తోపాటు ఈ మెయిల్‌ను సంపాదించాడు. ఆయన మొబైల్‌కు ఫోన్ చేశాడు. తన ఇంటికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలోనే అతడు ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయనను ఒక చోట కలిసి తమ తమ బ్యాగ్‌లను మార్చుకున్నారు.
అనంతరం నందన్ కుమార్ ఇండిగోకు ట్వీట్ చేశాడు. జరిగిన సంగతిని వివరించాడు. ఐవీఆర్‌ను, కస్టమర్ సర్వీస్‌ను మరింతగా మెరుగుపర్చాలని సూచించాడు. వెబ్సైట్ ద్వారా కీలక సమాచారం లీక్ అవుతున్నదని, దానిని సరిచేయాలని పేర్కొన్నాడు. దీనికి ఇండిగో స్పందించింది. నందన్ కుమార్‌కు కలిగిన ఇబ్బందికి ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. అలాగే వెబ్‌సైట్‌లోని భద్రతాపరమైన లోపాలను సరిచేస్తామని పేర్కొంది. మరోవైపు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ‘ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఏదైనా చేయగలడు’ అని ఒకరు కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

