Bengalore incident | రైడ్ క్యాన్సిల్ చేయలేదని కస్టమర్‌పై ఆటో డ్రైవర్ దాడి.. వీడియో
Bengalore incident | కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు: కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయమంటే చేయలేదని ఓ ఆటో డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన అనీశ్ అనే వ్యక్తి ఓ మొబైల్ యాప్‌లో ఆటో బుక్ చేశాడు. పికప్ పాయింట్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఎక్కువ చార్జి డిమాండ్ చేశాడు. దాంతో అనీశ్ అక్కర్లేదని చెప్పాడు.
అయితే, రైడ్ క్యాన్సిల్ చేయిమని ఆటో డ్రైవర్ అనీశ్‌పై హుకుం చేశాడు. అందుకు అనీశ్ ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దాంతో ఆటో దిగి వచ్చిన డ్రైవర్ అనీశ్‌పై దాడి చేశాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న అనీశ్‌ను డ్రైవర్ ముందుగా ఆటోతో ఢీకొట్టాడు. అనంతరం ఆటో దిగి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అనీశ్ ట్విటర్లో పోస్ట్ చేశాడు.
‘ఇది బెంగళూరు వాసులకు నిత్యం ఎదురయ్యే సమస్య. మీరు ఉబెర్ లేదా ఓలా ఆటోను బుక్ చేయండి. డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చెయ్ ఆఫ్‌లైన్‌లో తీసుకెళ్తా అంటాడు. అందుకు నువ్వు ఒప్పుకోకపోతే దాడి చేస్తాడు. నోటికొచ్చినట్టు తిడుతాడు’ అనే వ్యాఖ్యలను అనీశ్ తన ట్వీట్‌కు జతచేశాడు. అనంతరం బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ.. దయచేసి చర్యలు తీసుకోండి అని పేర్కొన్నాడు. ఆటో నంబర్ 7734 అని తెలిపాడు.
This is an every day hustle for a banglorean. Book an UBER/OLA. The driver asks you to cancel the ride and take it offline.
And if you say No,
You get hit by an auto, get beaten up and yelled at.Please take action. Be safe
Auto: 7784#UBER #bangaloretraffic #bangalorepolice pic.twitter.com/KLgnlE8txY— Anish S (@Anish0012) June 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

