filming women | మహిళలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు
filming women | ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న మహిళలు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఒక వ్యక్తి రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడు (filming women). అతడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న మహిళలు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఒక వ్యక్తి రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడు (filming women). అతడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మహదేవ్‌పురా ప్రాంతంలో పలు పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ (PG facility) ఉన్నాయి. అశోక్ అనే వ్యక్తి మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఎదురుగా ఉన్న ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న మహిళలపై అతడి కన్నుపడింది. వారు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ వెంటిలేషన్ వద్ద ఉన్న రంధ్రం ద్వారా రహస్యంగా వీడియోలు రికార్డు చేస్తున్నాడు. ఈ నెల 21 స్థానికులు అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు.
కాగా, నిందితుడు అశోక్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. మహిళలు స్నానం చేస్తున్న ఏడు వీడియోలు అతడి మొబైల్ ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. గత మూడు, నాలుగు నెలలుగా రహస్యంగా ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గ్రహించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. రహస్యంగా వీడియోలు తీసిన మహిళలను అశోక్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

