బెంగళూర్ : ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న బాలీవుడ్ మూవీ రాకీ అవుర్ రాణి కి ప్రేమ్ కహాని (Viral pic) అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ సాంగ్స్‌ను ఇన్‌స్టా రీల్స్ నుంచి యూట్యూబ్ వీడియోల వరకూ జనం హోరెత్తిస్తున్నారు. తమ క్లిప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మూవీ సాంగ్స్‌ను వాడుతున్నారు.
ఇక ఈ సినిమాలోని వాట్ జుంక సాంగ్‌కు బెంగళూర్ యువతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ సాంగ్‌లో ఆమె బాలీవుడ్ భామ అలియా భట్‌ను గుర్తుకుతెచ్చేలా ఉందని నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ సాంగ్‌లో అలియా ధరించిన చీరను పోలిన శారీలో సదరు మహిళ మెరిశారు. మ్యూజిక్ వీడియోలో అదే సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ వీడియోలో హోరెత్తించిన మహిళను రోష్నీ సోనిగా గుర్తించగా ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో 1.85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మీరు అచ్చం అలియా భట్లాగే ఉన్నారని కామెంట్స్ సెక్షన్లో ఓ యూజర్ రాసుకొచ్చారు. అసలు అలియా భట్‌ను దింపేశారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :