Don 3 | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న ప్రాంఛైజీల్లో డాన్ఒకటి. ఫర్హాన్ అఖ్తర్ (Farhan Akhtar) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే డాన్ 2తో డబుల్ ఎంటర్టైన్ మెంట్ అందించిన ఫర్హాన్ అఖ్తర్ ఇక డాన్ 3తో రెడీ అవుతున్నాడు. 12 ఏండ్ల తర్వాత డాన్ 3 (Don3)కి సంబంధించిన అప్డేట్ అందించాడు. కొత్త శకం మొదలైంది.. అంటూ డాన్ 3ని వీడియో ఒకటి షేర్ చేశారు ఫర్హాన్ అఖ్తర్.
అయితే మూడో పార్టులో షారుఖ్ ఖాన్ కాకుండా రన్వీర్ సింగ్ కనిపించబోతున్నాడని బీ టౌన్ సర్కిల్ టాక్. కాగా దీనిపై నెటిజన్లను పలు రకాలుగా స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ లేకుంటే డాన్ 3 లేదు.. అని ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ఒకవేళ షారుఖ్ ఖాన్ హీరో కాకుంటే డాన్ ప్రాంఛైజీ మాకొద్దు. మరో నటుడితో కొత్త సినిమా చేయండి అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. షారుఖ్ ఖాన్ మ్యానరిజాన్ని మరో యాక్టర్ చూపిస్తాడని అనుకోవడం లేదంటూ ఇంకో యూజర్ రాసుకొచ్చాడు.
చాలా అద్భుతమైన వార్త చెప్పారు. కానీ దయచేసి రన్వీర్ సింగ్ వద్దు.. కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే డాన్ పాత్రకు సెట్ అవుతారు. ఆయన డాన్ 3కి ఒకే చేసే వరకు ఆగండి అని మరో నెటిజన్ ఫర్హాన్ అఖ్తర్‌కు విజ్ఞప్తి చేశాడు. రన్వీర్ సింగ్ టైటిల్ రోల్లో త్వరలోనే డాన్ 3 టీజర్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని సమాచారం.