ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై గవర్నర్ జరిమానా రూ.500
పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై రగడ కొనసాగుతున్నది.
- బెంగాల్లో కొనసాగుతున్న ‘ప్రమాణ స్వీకార’ రగడ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై రగడ కొనసాగుతున్నది. స్పీకర్ వారి చేత ప్రమాణం చేయించడం, తాజాగా సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రాజ్‌భవన్ ఆ ఇద్దరు శాసనసభ్యులపై రూ.500 చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు గవర్నర్ సీవీ ఆనంద బోస్ కార్యాలయం నుంచి తమకు మెయిల్స్ వచ్చాయని ఎమ్మెల్యేలు హుస్సేన్ సర్కార్, శయంతికా బెనర్జీ సోమవారం వెల్లడించారు.
ప్రమాణ స్వీకార ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నించిన రాజ్‌భవన్.. రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఈనెల 5న ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ప్రక్రియను గవర్నర్ డిప్యూటీ స్పీకర్ అశిష్ బెనర్జీకి అప్పగించగా.. వారిద్దరి చేత స్పీకర్ బిమన్ బెనర్జీ ప్రమాణం చేయించారు. దీనిపై తాము స్పీకర్‌ను కలిశామని శయంతికా బెనర్జీ తెలిపారు. ఈ అంశాన్ని స్పీకర్ కార్యాలయం చూసుకుంటుందని ఆయన చెప్పారని పేర్కొన్నారు. తాము జరిమానా చెల్లించేది లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

