బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ నిరసన.. ప్రసంగం ఆపి వెళ్లిపోయిన గవర్నర్

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శుక్రవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జగదీప్ ధంఖర్ ప్రసంగాన్ని ప్రారంభించగా ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఎన్నికల అనంతర హింసపై ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో గవర్నర్ ధంఖర్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై తమ పోరాటం కొనసాగుతుందని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. సీఎం మమతా బెనర్జీ సర్కార్ రాసిన స్టేట్మెంట్నే గవర్నర్ చదువుతున్నారని, అందులో ఎన్నికల హింస గురించి లేకపోవడంతోనే బీజేపీ సభ్యులు నిరసన తెలిపారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

