Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
Baby Food | ఆరు నెలల్లోపు వయసున్న పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్ (Fructose), సుక్రోజ్ (Sucrose) లను కలుపొద్దని ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)’ ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్స్ ఫర్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్) రెగ్యులేషన్స్ యాక్ట్ 2020’ కి సవరణ ముసాయిదాను ప్రచురించింది.
Baby Food : ఆరు నెలల్లోపు వయసున్న పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్ (Fructose), సుక్రోజ్ (Sucrose) లను కలుపొద్దని ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)’ ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్స్ ఫర్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్) రెగ్యులేషన్స్ యాక్ట్ 2020’ కి సవరణ ముసాయిదాను ప్రచురించింది. పసితనంలోనే అదనపు చక్కెరలు తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పోషకాహార భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.
బిడ్డ ఎదుగుదలకు మొదటి ఆరు నెలలు ఎంతో కీలకమని, ఈ వయసు వారికి అవసరమైన పోషకాలు అందించేలా సంబంధిత ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్, సుక్రోజ్లను కలపకుండా చూసేలా ఈ ప్రతిపాదనలను రూపొందించారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనే ప్రభుత్వ సిఫార్సులను ప్రోత్సహించేందుకూ ఈ చర్యలు తోడ్పడతాయని పేర్కొన్నది. బాల్యంలోనే ఊబకాయం, సంబంధిత ఆరోగ్య సవాళ్లను అరికట్టడం కూడా ఈ ప్రతిపాదనల ఉద్దేశమని వెల్లడించింది.
అదేవిధంగా ముసాయిదా ప్రతిపాదనలపై 60 రోజుల్లోపు అభ్యంతరాలను, సూచనలను సమర్పించవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

