పిల్ల ఏనుగుకు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేటగిరి భద్రత ఏంటని అనుకుంటున్నారా? ఆ భద్రత కేవలం వీవీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులకు మాత్రమే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పిల్ల ఏనుగుకు జడ్ ప్లస్ భద్రతపై మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది నిజమే అనే భ్రమ ఆ వీడియో చూస్తే తప్పకుండా కలుగుతుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్ అవుతోంది.
సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వైరల్ వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఈ భూమ్మీద ఎవరూ కూడా అంత భద్రత కల్పించలేరు. అది కేవలం ఏనుగుల గుంపుకు మాత్రమే సాధ్యమైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగతా ఏనుగులు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాయని ఆయన పేర్కొన్నారు. ఈ దృశ్యం కోయంబత్తూర్లోని సత్యమంగళం ఏరియాలో ఆవిష్కృతమైందని తెలిపారు.
No body on earth can provide better security than an elephant herd to the cute new born baby. It’s Z+++.
Said to be from Sathyamangalam Coimbatore road. pic.twitter.com/iLuhIsHNXp— Susanta Nanda IFS (@susantananda3) June 22, 2022