కోల్కతా : ఎమ్మెల్యేగా బాబుల్ సుప్రియో బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. డెప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ బాబుల్ సుప్రియోతో ప్రమాణస్వీకారం చేయించారు. గత నెలలో బల్లిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో భాగంకావడం గొప్పగా అనిపిస్తోందని, ఇదో కొత్త అనుభవం అని పేర్కొన్నారు.
ఇంతకు ముందు బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా పని చేశారు. కేంద్ర కేబినెట్ పునవ్యవస్థీకరణలో మంత్రిని పదవిని కోల్పోవడంతో ఆ పార్టీ, ఎంపీ పదవికి రాజీనామా
సమర్పించారు. అనంతరం టీఎంసీలో చేరి బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం ఎన్నికల్లో బరిలోకి దిగారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12న ఉప ఎన్నిక జరగ్గా.. 16న వెలువడిన ఫలితాల్లో బాబుల్ సుప్రియో ఘన విజయం సాధించారు.