Azam Khan | వివాదాస్పద ప్రసంగం.. ఎస్పీ నేత అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు
Azam Khan | సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత అజాంఖాన్ (Azam Khan) కు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు శిక్ష విధించింది.
Azam Khan : సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత అజాంఖాన్ (Azam Khan) కు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు శిక్ష విధించింది. శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని ప్రస్తుతం రాంపూర్ జైలు (Rampur Jail) లో శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్‌కు ఈ తాజా తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అజాంఖాన్ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు కేవలం జీతం తీసుకునే ఉద్యోగులని, వారికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అదే సమయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రస్తావన తెస్తూ.. గతంలో సీనియర్ అధికారులు ఆమె బూట్లను చేతిరుమాళ్లతో తుడిచారని, ప్రస్తుతం తాము ఆమెతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి, అల్లా తలిస్తే ఈ అధికారులతో కూడా ఆమె బూట్లు పాలిష్ చేయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల వీడియోలు అప్పట్లో వైరల్ కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. అజాంఖాన్‌కు ఇలా చట్టపరమైన ఎదురుదెబ్బలు తగలడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది రెండు వేర్వేరు పాన్ కార్డులు కలిగి ఉన్నారనే ఫోర్జరీ కేసులో అజాంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా అజాంఖాన్లకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ శిక్షను సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా గత నెలలో రాంపూర్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

