Australian Man Buried In India | నెరవేరిన ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్‌లో మృతదేహం ఖననం
Australian Man Buried In India | ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి చివరి కోరిక నెరవేరింది. భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్‌లో ఖననం చేయాలని అభ్యర్థించాడు. 12వ సారి భారత్‌ను సందర్శించిన ఆయన అనారోగ్యంతో మరణించాడు.
పాట్నా: ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి చివరి కోరిక నెరవేరింది. భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్‌లో ఖననం చేయాలని అభ్యర్థించాడు. (Australian Man Buried In India) 12వ సారి భారత్‌ను సందర్శించిన ఆయన అనారోగ్యంతో మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి చివరి కోరికను అతడి భార్య నెరవేర్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసించే డోనాల్డ్ సామ్స్ (Donald Sams)కు భారత దేశమంటే ఎంతో గౌరవం, ప్రేమ. ఆస్ట్రేలియన్ హైకమాండ్ అధికారిగా ఆయన రిటైర్డ్ అయ్యారు. సామ్స్ తండ్రి బ్రిటీష్ పాలనలో అస్సాంలో పనిచేశారు.
కాగా, డోనాల్డ్ సామ్స్ భారత్‌కు వచ్చినప్పుడల్లా తన తండ్రికి నివాళిగా అస్సాంను సందర్శించేవారు. కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నదిలో బోటులో ప్రయాణించే వారు. భారత్‌తో అనుబంధం పెంచుకున్న ఆయన తన వీలునామాలో ప్రత్యేకంగా అభ్యర్థించారు. తన మృతదేహాన్ని భారత్‌లోని స్మశానవాటికలో ఖననం చేయాలని చివరి కోరికగా పేర్కొన్నారు.
మరోవైపు 91 ఏళ్ల డోనాల్డ్ సామ్స్ తన భార్య ఆలిస్ సామ్స్‌తో సహా 42 మంది బృందంతో కలిసి ఇటీవల 12వ సారి భారత్‌కు వచ్చారు. యథావిధిగా అస్సాంను ఆయన సందర్శించారు. ఎప్పటి మాదిరిగానే కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నది ద్వారా క్రూయిజ్‌లో ప్రయాణించారు. అయితే ఫిబ్రవరి 21న బోటులో ఉండగా ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో ముంగేర్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, డోనాల్డ్ సామ్స్ మరణం గురించి భారత యంత్రాంగం, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి ముంగేర్ జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. తన భర్త వీలునామాలో పేర్కొన్న ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు సహకరించాలని భార్య ఆలిస్ సామ్స్ ఆస్ట్రేలియా ఎంబసీని అభ్యర్థించింది. అనుమతి పొందడంతో ముంగేర్ జిల్లా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. దీంతో శనివారం చురంబాలోని క్రైస్తవ స్మశానవాటికలో డోనాల్డ్ సామ్స్ మృతదేహాన్ని క్రైస్తవ ఆచారాలతో ఖననం చేశారు. జిల్లా కలెక్టర్ అవ్నిష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

