Navneet Rana | అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాపై దాడికి యత్నం..!
Navneet Rana | అమరావతి మాజీ ఎంపీ, నటి నవనీత్ రాణాపై పలువురు దాడికి యత్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అమరావతి జిల్లా దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలు దాడికి యత్నించడంతో పాటు కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Navneet Rana | అమరావతి మాజీ ఎంపీ, నటి నవనీత్ రాణాపై పలువురు దాడికి యత్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అమరావతి జిల్లా దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలు దాడికి యత్నించడంతో పాటు కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచార కార్యక్రమం ఈ నెల 18తో ముగియనున్నది. దాంతో ఆమె దరియాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఖల్లార్పూర్ గ్రామంలో యువ స్వాభిమాన్ అభ్యర్థి రమేశ్ బండిలే మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవనీత్ రాణా ప్రసంగిస్తున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా పలువురు నినదించారు. అయితే, ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని నవనీత్ రాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగానికి అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారని ఆరోపించారు. అయితే, వారంతా ఓ వర్గానికి చెందిన వారని.. తనను దూషిస్తూ దాడికి యత్నించారని.. ఉమ్మివేశారన్నారు. తనను గన్స్మెన్స్ కాపాడి తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలో గన్మెన్లలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. కుర్చీ విసిరడంతో గాయమైనట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

