Kalindi Express | పట్టాలపై గ్యాస్ సిలిండర్.. కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు (Kalindi Express) తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌కు (Kalindi Express) తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాళింది ఎక్స్‌ప్రెస్ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్ ప్రాంతాంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రెయిన్‌ను ఆపేశాడు. అప్పటికే రైలు సిలిండర్‌ను ఢీకొట్టడంతో అది పట్టాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

Kalindi 1
సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టను కూడా గుర్తించారు. రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే వీటిని ట్రాక్‌పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, రైలును కొద్దిసేపు నిలిపివేసిన అధికారులు.. ఆ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

