రూ.500కే రెండు డోసుల బీఈ కోర్బ్వ్యాక్స్ టీకా !

హైదరాబాద్: బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన కోవిడ్ టీకా ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నది. కోర్బ్వ్యాక్స్ టీకాలను అత్యంత తక్కువ ధరకు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు డోసులు కలిపితే ఆ టీకాల ఖరీదు రూ.500 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్బ్వ్యాక్స్ మూడవ దశ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకవేళ ఆ టీకాకు అత్యవసరం ఆమోదం దక్కితే ఇక ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. అన్నీ అనుకూలిస్తే ఆ టీకాకు చెందిన రెండు డోసుల ధర రూ.400 లోపే ఉంటుందని కూడా ఓ వార్త కథనం పేర్కొన్నది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం బీఈ సంస్థ 30 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయనున్నది. ఆర్బీడీ ప్రోటీన్ సబ్ యూనిట్ రీతిలో వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నారు. బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసన్‌తో ఈ టీకాలను బీఈ డెవలప్ చేయనున్నది. దీనితో పాటు కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరపాటిక్స్ హోల్డింగ్స్తోనూ బీఈ ఒప్పందం కుదుర్చుకున్నది. కెనడా కంపెనీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నది. ప్రావిడెన్స్తో కలిపి వచ్చే ఏడాది నాటికి వంద కోట్ల టీకాలను బీఈ ఉత్పత్తి చేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

