కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారు.. చాలా బాధపడ్డా : బాబుల్ సుప్రియో

కోల్‌కతా: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారని, తాను చాలా బాధపడ్డానునని బాబుల్ సుప్రియో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పష్టత ఇచ్చిన ఆయన ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తునందుకు చాలా సంతోషంగా ఉన్నదని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియో బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగుతున్నందుకు చాలా బాధగా ఉన్నదని ఆయన తెలిపారు. అయితే ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు.
కాగా, తనను రాజీనామా చేయమన్నారంటూ తొలుత ఆవేదన వ్యక్తం చేసి తొలగించిన పోస్ట్‌పై బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. తాను అలా పేర్కొనడం సరికాదని స్పష్టత ఇచ్చారు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు ఆయన తెలిపారు. అలాగే పశ్చిబెంగాల్‌కు చెందిన కొందరు నేతలు కేంద్ర మంత్రులు కానుండటంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రీయో వారికి అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగడం తనకు బాధగా ఉన్నా, బెంగాల్ నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కడంపై చాలా సంతోషంగా ఉన్నదని సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

