Ashwini Vaishnaw | భారీగా పెరగనున్న జనరల్ కోచ్‌లు : రైల్వే మంత్రి
Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ వేసవిలో భారీ రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వేలు 10000పైగా ప్రత్యేక రైళ్లను నడిపాయని మంత్రి తెలిపారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తాము కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు.
50 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రారంభమైందని, 150 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. గత ఏడాది 5300 కిలోమీటర్ల నూతన ట్రాక్‌లు జోడించామని చెప్పారు. ఈ ఏడాది కూడా 800 కిలోమీటర్ల పైగా ట్రాక్‌లను జోడిస్తామని తెలిపారు. కవచ్‌ను అమలు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని మంత్రి వెల్లడించారు.
కాగా అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇటీవల రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి ఈ వివరాలు తెలిపారు. 2026 నాటికి దేశ తొలి బుల్లెట్ రైలు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అహ్మదాబాద్-ముంబయి హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పొడవు 508 కిలోమీటర్లు గా ఉంది. 2028లో పూర్తిస్థాయి విస్తరణ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Kalki 2898 AD | కల్కి 2898 ఏడీలో కృష్ణుడి ముఖాన్ని చూపించకపోవడంపై నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

