Ashok Gehlot | న్యాయవ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ
న్యాయవ్యవస్ధలో అవినీతిపై చేసిన వ్యాఖ్యలకు గాను రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) హైకోర్టుకు క్షమాపణ తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాదించిఉంటే మన్నించాలని లిఖితపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పారు.
జైపూర్ : న్యాయవ్యవస్ధలో అవినీతిపై చేసిన వ్యాఖ్యలకు గాను రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) హైకోర్టుకు క్షమాపణ తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాదించిఉంటే మన్నించాలని లిఖితపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు తన ఆలోచన కాదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్ధపై గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు గత నెలరోజులుగా దుమారం రేపుతుండగా ఆయన క్షమాపణలు కోరడంతో ఈ వివాదానికి తెరపడింది.
ఆగస్ట్ 30న సీఎం విలేకరులో మాట్లాడుతూ న్యాయవ్యవస్ధలో అవినీతి పెరిగిపోయింది. కొందరు న్యాయవాదులు రాసిచ్చిన తీర్పులే తర్వాత వెలువడుతున్నాయని కూడా తాను విన్నానని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలను న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్‌లో న్యాయవాదులు సమ్మెకు దిగడంతో పాటు సీఎంపై కేసు నమోదు చేశారు.
గెహ్లాట్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ కొందరు పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 5న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుండటంతో గెహ్లాట్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తనకు న్యాయవ్యవస్ధ పట్ల అపార గౌరవం ఉందని, న్యాయవ్యవస్ధలో అవినీతి గురించి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం కాదని పేర్కొన్నారు.
Read More :
Mad Movie | ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మాస్ రచ్చ.. ‘మ్యాడ్’ ఎక్కిస్తున్న ట్రైలర్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TMREIS | మైనారిటీలపై సర్కార్ కుట్ర.. 75% సీట్లను 17% కుదిస్తే మైనారిటీ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి?: అబ్దుల్ వాహబ్
Ambedkar | అంబేద్కర్‌కు అవమానం.. రాజ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన ప్రకటనల్లో రాజ్యాంగ నిర్మాత ఫొటో మాయం
Horoscope | 27-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ఈడా మనమే.. ఆడా మనమే!
ఒక నాయకుడి సంకల్పం..
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

