Mad Movie | ఈ వారం గంపగుత్తగా రిలీజవుతున్న సినిమాలో మ్యాడ్ ఒకటి. తారక్ బావమరిది నవీన్ నార్నే హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు యూత్ మొత్తం వత్తాసు పలికారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కాలేజ్గ్యాంగ్స్, సీనియర్లు, ర్యాగింగ్, ప్రేమలు, గొడవలు ఇలా ఓ రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది మ్యాడ్ ట్రైలర్. అల్లరి తప్ప చదువు మీద ధ్యాసలేని ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్లు తింగరితనంతో చేసే పనులు ఎంత దాకా తీసుకొచ్చాయి. అసలు వాళ్ల గోల్ ఏంటి? చివరికి వాళ్లు సాధించిందేంటి అనే విషయాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని ట్రైలర్‌తో కాస్త క్లారిటీ వచ్చింది.
ట్రైలర్ చూస్తే మట్టుకు కేవలం యూత్‌ను టార్గెట్‌గా పెట్టుకుని వస్తున్నట్లు అర్థమయిపోయింది. యూత్‌ను మెప్పించే కంటెంట్‌తో వస్తే చాలు కలెక్షన్లు ఊహకందని స్థాయిలో ఉంటాయని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కే సినిమాలకైతే యూత్‌లో ఓ రేంజ్లో హైప్ ఉంటుంది. సరైన కంటెంట్‌తో వస్తే మట్టుకు కోట్లు కొల్లగొట్టడం ఖాయం. హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం, సై లాంఇ సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో అలా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఆహా ఓహో అనిపించే రేంజ్లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడా వెలతిని తీర్చేందుకు వస్తుంది మ్యాడ్ సినిమా.
సితారా, ఫార్య్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ముందుగా సెప్టెంబర్ 28న రావాలని ఫిక్సయింది. కానీ పోటీగా మూడు సినిమాలు రిలీజ్ కావడంతో రిలీజ్‌ను వారం రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ వారం ఈ సినిమాకు పోటీగా అరడజను సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే మామా మశ్చీంద్రా, రూల్స్ రంజన్ తప్పితే పెద్దగా పేరున్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు.