ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు, ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్కు ( Aryan Khan ) బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆర్యన్ వాట్సాప్ చాట్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చిచెప్పింది. డ్రగ్స్ కేసులో బెయిల్పై విడుదలైన ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లో కుట్ర దాగి ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తాజా తీర్పులో పేర్కొన్నది. నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంచేసింది.
ఆర్యన్ ఖాన్ గత నెల 3న ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడు వారాలు జైల్లో ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యాడు. ఆయనతోపాటు అదే కేసులో నిందితులుగా ఉన్నఅర్బాజ్ ఖాన్, మున్మున్ ధమేచ కూడా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.