ఇంటింటికీ రేషన్ డెలివరీ స్కీమ్ : ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను బాసటగా నిలిచానని..ఇదే స్ఫూర్తితో మీరూ మాకు అండగా నిలవాలని లేఖలో ప్రధాని మోదీని కేజ్రీవాల్ కోరారు. కొవిడ్-19తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈ పధకానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు కోరినా వాటిని చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ పధకాన్ని నిలిపివేయరాదని ఢిల్లీలోని 70 లక్షల పేదల తరపున తాను చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఆప్ ప్రభుత్వం ప్రారంభించనున్న విప్లవాత్మక రేషన్ డెలివరీ స్కీమ్ ను కేంద్రం నిలిపివేసిందని అంతకుముందు కేజ్రీవాల్ మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రేషన్ డెలివరీ పధకం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా కేంద్రం మోకాలడ్డిందని ఆరోపించారు. ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే కార్యక్రమం అమలైతే రేషన్ మాఫియాకు తెరపడుతుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Arvind Kejriwal
- Delhi
- Door step
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

