Gautam Adani: గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ
Gautam Adani: గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అమెరికా జడ్జి ఆ ఆదేశాలు ఇచ్చారు. మల్టీ బిలియన్ డాలర్ స్కామ్‌లో గౌతం అదానీని దోషిగా తేల్చారు. సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం జరిగిన బాండ్ల సేకరణలో అదానీ ముడుపులు ఇవ్వచూపినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీ( Gautam Adani)కి.. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్లలో దాదాపు రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జడ్జి జారీ చేశారు. ప్రాసిక్యూటర్లు ఆ వారెంట్‌ను .. విదేశీ న్యాయశాఖకు అందజేయనున్నారు.
అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో.. అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా పెట్టుబడీదారులను, అధికారులను మోసం చేసినట్లు గౌతం అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ఆ అభియోగాలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

