Arrest | అత్తను దారుణంగా కొట్టిన కోడలు అరెస్ట్.. Video
Arrest | వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కొల్లామ్: వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వెలిబుచ్చారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలోని కొల్లామ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వీడియోలో ఏముందంటే.. వృద్ధురాలైన అత్త బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లో మంచంపై కూర్చుని టీవీ చూస్తున్నది. ఆగ్రహించిన కోడలు కాసేపటికే ఆమె దగ్గరికి వచ్చింది. మంచం పైనుంచి లేచి బయటికి వెళ్లిపో అని అత్తను గదమాయించింది. అత్త వినిపించుకోక పోవడంతో వెనుక నుంచి బలంగా తోసేసింది. దాంతో వృద్ధురాలు బొక్కబోర్లా పడిపోయింది. వెంటనే లేచి కూర్చుని కాళ్లు, చేతులు తడుముకుంటూ నొప్పి అని ఏడ్చింది. ఇదంతా బెడ్ రూమ్‌లో ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేశాడు. వీడియో రికార్డు చేసిన వ్యక్తి నిందితురాలి భర్తనా, ఇంకెవరైనానా అనే వివరాలు తెలియరాలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సామాజిక ఉద్యమకారిణి దీపికా నారాయణ్ భరద్వాజ్ ఈ వీడియోను షేర్ చేశారు. సమాజంలో వృద్ధులపై హింస పెరుగుతున్నదంటూ ఆమె తను షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అత్తను కొట్టిన మహిళను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పోస్టును కేరళ పోలీసులకు ట్యాగ్ చేశారు. దాంతో కేరళ పోలీసులు గురువారం రాత్రి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి తీరుపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అత్త ఇచ్చిన ఆస్తులు అనుభవించుకుంటూ ఆమెపై ఇలా దాడి చేయడం దారుణమని అంటున్నారు.
Abuse of elderly is increasing so much in society. Such treatment is sick to say the least. This woman should be arrested if she hasn’t already been. What’s really disturbing is how she’s training even the child to abuse the old lady. Kindly tag policepic.twitter.com/kWI1ysNrb9
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) December 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

