Watch: జ్యువెలరీ షాప్‌ను దోచుకున్న సాయుధ దుండగులు.. కాల్పుల్లో యజమాని మృతి
Jewellery Shop Loot | సాయుధ దుండగులు జ్యువెలరీ షాప్‌ను దోచుకున్నారు. వారు జరిపిన కాల్పుల్లో షాపు యజమాని మరణించాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జైపూర్: సాయుధ దుండగులు జ్యువెలరీ షాప్‌ను దోచుకున్నారు. (Jewellery Shop Loot) వారు జరిపిన కాల్పుల్లో షాపు యజమాని మరణించాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజస్థాన్‌లోని భివాడిలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 23న సాయంత్రం ఏడు గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు కారులో కమలేష్ జ్యువెలర్స్ వద్దకు వచ్చారు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డును కర్రతో కొట్టి అతడి వద్ద ఉన్న గన్ను లాక్కొన్నారు.
కాగా, నగల షాపులోకి ప్రవేశించిన దుండగులు 48 ఏళ్ల యజమాని జై సింగ్‌పై దాడి చేశారు. అతడి కుమారుడు వైభవ్, షోరూమ్ సిబ్బందిని కొట్టి బంధించారు. వెంట తెచ్చిన రెండు బ్యాగుల్లో లక్షల విలువైన బంగారం, వెండి నగలను దోచుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా జై సింగ్ సోదరుడు మధుసూదన్ బయటి నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో నగల షోరూమ్ లోపల ఒక బ్యాగ్‌ను వదిలేసిన దుండగులు మరో బ్యాగ్‌తో కారులో హర్యానా వైపు పారిపోయారు.
మరోవైపు దుండగుల తుపాకీ కాల్పుల్లో జ్యువెలరీ షాప్ యజమాని జై సింగ్, అతడి సోదరుడు మధుసూదన్, గార్డు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ జై సింగ్ మరణించాడు. మధుసూదన్‌కు భివాడిలో, వెన్నెముకలో బుల్లెట్ దిగిన గార్డును గురుగ్రామ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనపై స్థానిక నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://twitter.com/AmitYaddav/status/1827236745701736633?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1827236745701736633%7Ctwgr%5E23342c99a24d9aef85e2cf0f5e5d046d6e4aeba5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Findia%2Frajasthan-5-armed-men-storm-into-jewellery-shop-fire-shots-killing-owner-injuring-2-others-in-bhiwadi-shocking-videos-of-robbery-murder-surface
राजस्थान के भिवाड़ी में बड़ी वारदात –
5 बदमाश ज्वैलरी शोरूम में घुस गए। सर्राफ कारोबारी जय सिंह की गोली मारकर हत्या की। उनका भाई भी गोली लगने से घायल हुआ। बदमाश ज्वैलरी लूटकर फरार हो गए।
⚠️Disturbing Visual⚠️ pic.twitter.com/sCt4Kp4SrC
— Sachin Gupta (@Sachingupta) August 23, 2024
भाजपा राज में राजस्थान की चौपट कानून व्यवस्था।
भिवाड़ी के ज्वैलर्स दुकान में पांच डकैत घुसे, ज्वैलरी लूटी और मालिक की गोली मारकर हत्या कर भाग गए। pic.twitter.com/UdV76WRdx2
— Keshav Chand Yadav (@keshavyadaviyc) August 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

