Rajnath singh | రాజ్‌నాథ్ సింగ్ నోట ‘పుష్ప’ డైలాగ్.. తగ్గేదేలే అంటూ డైలాగ్
సినిమాలోని డైలాగులు అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ వినిపిస్తుంటాయి. రాజకీయ నేతలు తమ ఉపన్యాసం మధ్య మధ్యలో సినిమా డైలాగులను ప్రయోగిస్తూ… అటు ప్రజలను, ఇటు కేడర్‌ను ఉత్సాహపరుస్తూ వుంటారు. ఎన్నికల్లో అయితే… ఈ ప్రయోగం మరీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటున్నారు. అయితే… మన తెలుగు సినిమా పుష్ప డైలాగ్ మాత్రం నేతలు విరివిగా వాడుతున్నారు.
మొన్నటికి మొన్న పంజాబ్ సీఎం పుష్ప సినిమాలోని డైలాగును ప్రయోగిస్తే… తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా జరిగిన ర్యాలీలో పుష్ప సినిమా డైలాగ్‌నే ప్రయోగించి, కేడర్‌లో, ప్రజల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. .పుష్ప సినిమా డైలాగును ప్రయోగించారు. ‘ఈ మధ్య పుష్ప సినిమా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే మన ముఖ్యమంత్రి పేరు పుష్కర్. ఈ పేరు విని కాంగ్రెస్ వాదులు ఫ్లవర్ అనుకుంటున్నారు. కానీ… వారికి చెప్పాలనుకుంటున్నాను.. పుష్కర్ అంటే ఫ్లవర్ కూడా.. ఫైర్ కూడా. మన పుష్కర్ ఎప్పటికీ తగ్గడు.. తగ్గేదేలే’ అంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అనుసరించిన తప్పుడు విధానాల వల్లే…
కాంగ్రెస్ అనుసరించిన తప్పుడు విధానాల వల్లే చైనా పాక్ దేశాలు దగ్గరయ్యాయని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. ఆ రెండు దేశాలు దగ్గరవ్వడానికి కాంగ్రెస్సే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జరిగిన చరిత్రను కాంగ్రెస్ ఇప్పటి వరకూ చదవనే లేదని రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. దేశ చరిత్రను కాంగ్రెస్ కచ్చితంగా అధ్యయనం చేయాలని రాజ్‌నాథ్ సలహా ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

