Anil Vij | ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్ మార్పు.. బీజేపీ నేతల విమర్శలను ఖండించిన అనిల్ విజ్
Anil Vij | హర్యానా మాజీ హోం మంత్రి అనిల్ విజ్, తన ఎక్స్ బయోలో ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను మార్చారు. కింది లైన్లోకి దానిని మార్చడంతో ఎక్స్ బయోలో ఆయన పేరు పక్కన అది మాయమైంది. అయితే దీనిపై వస్తున్న విమర్శల దాడిని ఆయన ఖండించారు.
చండీగఢ్: హర్యానా మాజీ హోం మంత్రి అనిల్ విజ్ (Anil Vij) తన ఎక్స్ బయోలో ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను మార్చారు. కింది లైన్లోకి దానిని మార్చడంతో ఎక్స్ బయోలో ఆయన పేరు పక్కన అది మాయమైంది. అయితే మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో అనిల్ విజ్ ఉద్దేశపూర్వకంగానే ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను కిందకు మార్చారంటూ ఆ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆరోపించారు.
కాగా, ఈ విమర్శల దాడిని అనిల్ విజ్ ఖండించారు. ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను కిందకు దించడంపై వివరణ ఇచ్చారు. తాను ఇప్పుడు మాజీ అయ్యానని, అందుకే ప్రతి చోట ఎక్స్ అని రాసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) బయోలో ‘హర్యానా మాజీ హోంమంత్రి’ అని పేర్కొనడం వల్ల నిర్ణీత అక్షరాల సంఖ్య మించిపోయిందని చెప్పారు. దీంతో మోదీ కుటుంబానికి చెందిన తాను ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను పై వరుస నుంచి కిందకు మార్చాల్సి వచ్చిందని అన్నారు.
మరోవైపు ‘మోదీ కా పరివార్’ ట్యాగ్‌లైన్‌ను కిందకు మార్చిన నేపథ్యంలో తనపై బురద జల్లేందుకు కొంత మంది బీజేపీ నేతలు, మద్దతుదారులకు అవకాశం కలిగిందని అనిల్ విజ్ విమర్శించారు. అయితే తాను బలమైన బీజేపీ భక్తుడినని అన్నారు. ఆరోపణలు చేసే ముందు తనతో మాట్లాడి ఉంటే దీని గురించి స్పష్టత ఇచ్చేవాడినని ఎక్స్‌లో వివరణ ఇచ్చారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ బీజేపీ నేతలు, పార్టీ మద్దతుదారులపై ఆయన మండిపడ్డారు.
सब को पता है की मैं अब एक्स हो गया हूं और सभी जगह पर मुझे एक्स लिखना चाहिए । परंतु जब मैं X पर अपनी प्रोफाइल में एक्स लिखने लगा तो नाम में लिखे जाने वाले अक्षरों को संख्या निश्चित संख्या से ज्यादा हो गई तो उस में से ( मोदी का परिवार ) जो कि मैं हूं ही वह ऊपर से हटाकर नीचे लगाना…
— Anil Vij Minister Haryana, India (@anilvijminister) April 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

