man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
man pushes girlfriend into gorge | ప్రియురాలు బ్రేకప్ చెప్పడంపై ప్రియుడు ఆగ్రహించాడు. ఆమెను లోయలోకి తోసేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ మహిళ కనిపించడం లేదని తొలుత అతడు చెప్పాడు. అయితే దర్యాప్తులో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు.
ముంబై: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంపై ప్రియుడు ఆగ్రహించాడు. ఆమెను లోయలోకి తోసేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ మహిళ కనిపించడం లేదని తొలుత అతడు చెప్పాడు. అయితే దర్యాప్తులో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. (man pushes girlfriend into gorge) మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గార్గోటిలోని అవధూత్ కాలనీకి చెందిన 25 ఏళ్ల శ్రీపాద్ దింకర్, ఎదురు ఇంట్లో నివసించే 23 ఏళ్ల తరణ్ణుమ్ బషీర్ నాయక్ ప్రేమించుకున్నారు. మహగావ్లోని కాలేజీలో ఆమె ఇంజినీరింగ్ చదువుతున్నది. ఇటీవల తరణ్ణుమ్కు ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమైంది. దీంతో శ్రీపాద్‌తో సంబంధాన్ని కొనసాగేందుకు ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
కాగా, అక్టోబర్ 9న తరణ్ణుమ్కు శ్రీపాద్ ఫోన్ చేశాడు. నాయక్వాడిలోని లోతైన లోయ సమీప ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లాడు. తనకు వివాహం నిశ్చయమైందని, ఇకపై తమ సంబంధాన్ని కొనసాగించలేమని ఆమె అతడికి చెప్పింది. తరణ్ణుమ్ నిర్ణయం పట్ల శ్రీపాద్ ఆగ్రహించాడు. ఆమెను లోయలోకి తోసేయడంతో మరణించింది.
ఆ తర్వాత భుదర్గఢ్ పోలీస్ స్టేషన్‌కు శ్రీపాద్ వెళ్లాడు. తరణ్ణుమ్ అదృశ్యమైనట్లు తొలుత చెప్పాడు. పోలీసులు అతడ్ని ప్రశ్నించగా చివరకు ఆమెను లోయలోకి తోసేసినట్లు ఒప్పకుని లొంగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీపాద్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- angry
- break up
- girlfriend
- Gorge
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

