Amritpal Singh | ఢిల్లీ రోడ్లపై అమృత్‌పాల్ సింగ్.. మాస్క్ ధరించి తిరుగుతున్న ఖలిస్థాన్ నేత..!
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) మరో కొత్త అవతారమెత్తారు. తాజాగా అతడు ఢిల్లీ రోడ్ల (Delhi Roads)పై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) మరో కొత్త అవతారమెత్తారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్‌లో పోలీసుల కండ్లు కప్పి పరారైన అమృత్‌పాల్ సింగ్ మతపరమైన సంప్రదాయ దుస్తులు కాకుండా.. వేషాలు మార్చి తిరుగుతున్నాడు. హర్యానా (Haryana), పాటియాలా (Patiyala) వీధుల్లో తిరుగుతున్న ఖలిస్థాన్ నేతకు సంబంధించిన సీసీటీవీ (CCTV Footage) దృశ్యాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా అతడు ఢిల్లీ రోడ్ల (Delhi Roads)పై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది.
ఫుటేజీలో అమృత్‌పాల్ సింగ్ తలపాగా లేకుండా కనిపించాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మారువేషం ధరించాడు. సన్ గ్లాసెస్, డెనిమ్ జాకెట్ ధరించాడు. అతని సహాయకుడు పపల్‌ప్రీత్ సింగ్ (Papalpreet Singh ) కూడా సీసీటీవీ క్లిప్‌లో కనిపించాడు. ఎవరూ గుర్తు పట్టకుండా ఇద్దరూ మాస్క్‌లు ధరించి ఢిల్లీ రోడ్లపై నడుచుకుంటూ వెళ్తూ కనిపించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ మార్చి 21వ తేదీదిగా తెలుస్తోంది.
కాగా, గత వారం హర్యానాలోని కురుక్షేత్రలో తలదాచుకున్న అమృత్‌పాల్, పపల్ ప్రీత్ సింగ్.. అక్కడి నుంచి తప్పించుకుని ఢిల్లీ వచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అతను ఇంకా ఢిల్లీలోనే తలదాచుకున్నాడా..? లేక ఇతర మార్గాల గుండా వేరే రాష్ట్రానికి పారిపోయాడా..? అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
నేపాల్‌లో దాక్కున్న ఖలిస్థాన్ నేత..?
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh ) ప్రస్తుతం నేపాల్ (Nepal)లో దాక్కున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేయాలని నేపాల్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం.. కాన్సులర్ సర్వీసెస్ విభాగానికి లేఖ రాసింది. అలాగే, అమృత్‌పాల్‌సింగ్ వ్యక్తిగత వివరాలను అన్ని హోటళ్ల నుంచి ఎయిర్‌లైన్స్ వరకు సర్క్యులేట్ చేసింది. 18 పేర్లతో నకిలీ పాస్‌పోర్టులు కలిగిన అమృత్‌పాల్‌సింగ్ మార్చి 18 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
Also Read..
Priyanka Chopra | ఇక్కడి రాజకీయాలతో విసుగుచెందా.. బీటౌన్‌ను వీడటంపై తొలిసారి నోరువిప్పిన ప్రియాంక
Rahul Gandhi | ఆ నోటీసులకు కట్టుబడి ఉంటా.. బంగ్లాను ఖాళీ చేస్తా : రాహుల్ గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

