Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్స్‌లో కిస్సులు.. ప్లేబాయ్‌గా ఖలిస్తానీ నేత
Amritpal Singh:ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు.. అసభ్యకర వీడియోలతో ఆడవాళ్లను వేధించాడు. ఇన్‌స్టాలో పరిచయమైన ప్రతి అమ్మాయితో చాటింగ్ చేశాడు. రిలేషన్ ఫిక్స్ అయ్యింది.. హనీమూన్ దుబాయ్‌లో అంటూ ఓ మహిళకు మెసేజ్ చేశాడు.
చండీఘడ్: ఖలిస్తానీ (Khalistani)నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) గురించి పంజాబ్ పోలీసులు గత ఆరు రోజుల నుంచి వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కన్నుగప్పి పరారీలో ఉన్న ఆ వేర్పాటువాద నేత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది మహిళలతో అతను వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఒప్పందాలు లేకుండా పెళ్లి చేసుకోవడం.. వీడియో కాల్స్(video calls)లో మహిళలకు అమృత్‌పాల్ కిస్సులు ఇస్తున్నట్లు ఉన్న కొన్ని మెసేజ్‌లు బయటకు వచ్చాయి.
సపరేట్ రాష్ట్రం(separate state) కావాలని కోరుకుంటున్న అమృత్‌పాల్.. ఒంటరిగా ఉన్న మహిళలు, వివాహితల(married women)ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆ మహిళలను వశపరుచుకున్నట్లు ఓ ఆంగ్ల సైట్ తన కథనంలో రాసింది. అమృత్పాల్లో ఎన్నో శృంగార కోణాలు ఉన్నట్లు ఆ కథనంలో తెలిపారు. అసభ్యకర వీడియోలతో మహిళలను బ్లాక్మెయిల్(blackmail) చేసినట్లు కూడా తెలుస్తోంది. చాటింగ్, వాయిస్ నోట్స్ పరిశీలించిన తర్వాతే ఈ అంచనాకు వచ్చారు.
దాదాపు 12 వాయిస్ నోట్స్‌ను ఆ సైట్ యాక్సెస్ చేసింది. మహిళలతో అతను క్యాజువల్ రిలేషన్షిప్(casual relationship) కోరుకున్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. ఎటువంటి సీరియస్ సంబంధాల్ని అమృత్‌పాల్ ఇష్టపడలేదట. వివాహ బంధానికి ఎటువంటి సమస్య రానంత అమృత్‌పాల్‌తో అఫైర్ పెట్టుకునేందుకు ఓ మహిళ ఆసక్తిగా చూపింది. ఆ వాయిస్ మెసేజ్‌ను కూడా పరిశీలించారు.
ఇక ఇన్స్టాగ్రామ్(Instagram)లో అమృత్‌పాల్‌ను ఫాలోఅయ్యే ఆడవాళ్లు ఎక్కువే. వారందరికీ అతను రెగ్యులర్‌గా మెసేజ్‌లు చేస్తుంటాడట. ఓ మహిళతో ఇన్‌స్టాలో సంభాషిస్తూ.. ఇక మన వివాహేతర సంబంధం ఫిక్స్ అయినట్లు పేర్కొన్నాడు. మన హనీమూన్(Honeymoon) దుబాయ్‌లో ఉంటుందని ఆ మెసేజ్‌లో రాశాడు. దానికి బదులుగా ఆ మహిళ లాఫింగ్ ఎమోజీలను పంపినట్లు గుర్తించారు.
గత శనివారం నుంచి అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు(Punjab police) గాలిస్తున్న విషయం తెలిసిందే. మారువేషాల్లో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతనితో లింకు ఉన్న మద్దతుదారుల్ని కొందర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. వార్సీ పంజాబ్ దే కార్యకర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొందర్ని అస్సాంలోని దిబ్రుఘర్‌లో ఉన్న జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

