పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విందు రాజకీయం

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరును చక్కదిద్దడంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విందు రాజకీయానికి తెర తీశారు. తనపై, తన పాలనపై అసంతృప్తిగా ఉన్న హిందూ నేతలను బుజ్జగించేందుకు గురువారం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విందు సమావేశానికి సుమారు 20 మంది నేతలు హాజరయ్యారు. పంజాబ్ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించవచ్చని భావిస్తున్న ఎంపీ మనీష్ తివారీ, విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా కూడా ఈ విందు భేటీలో పాల్గొన్నారు. వీరిద్దరు కూడా సీఎం అమరీందర్ సింగ్ అనుచరులే.
మరోవైపు సీఎంపై అమరీందర్ సింగ్‌పై చాలా కాలంగా మండిపడుతున్న కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరును చక్కదిద్దేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిద్ధూకు పార్టీలో కీలక పాత్ర ఇవ్వాలని సూచించింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ ఆ మేరకు వ్యవహరించాలని, విద్యుత్ బిల్లులు తగ్గించడంతోపాటు ఇసుక, రవాణా మాఫీయాపై చర్యలు చేపట్టాలని కమిటీ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడితోపాటు ఇతర పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో సీఎం అమరీందర్ సింగ్ విందు దౌత్యానికి తెర తీయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

