Viral Video: టమాటాలకు రక్షణగా నాగుపాము.. వీడియో వైరల్
King Cobra ‘Guards’ Tomatoes | దేశంలో టమాట ధరలు కొండెక్కాయి. కిలో వంద నుంచి రెండొందల వరకు ధరలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలపై మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఒక నాగుపాము టమాటాలకు రక్షణగా ఉన్నది (snake protecting tomatoes). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: దేశంలో టమాట ధరలు కొండెక్కాయి. కిలో వంద నుంచి రెండొందల వరకు ధరలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టమాటాలపై మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ఒక నాగుపాము టమాటాలకు రక్షణగా ఉన్నది (snake protecting tomatoes). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీర్జా ఎమ్డీ ఆరిఫ్ అనే ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఒక ఇంట్లో టమాటాలున్న చోటుకు ఒక నాగుపాము చేరింది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైనవిగా ఉన్న టమాటాలకు కాపాలాగా ఉన్నది. వాటి దగ్గరకు వచ్చే వారిపై దాడి చేసి కాటేసేందుకు పడగ విప్పుతుంది. ‘నిధి కంటే విలువైన టమాటాలను పాము రక్షిస్తున్నది’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
కాగా, టమాటాలకు రక్షణగా ఉన్న పాము వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా స్పందించారు. ‘టమాటాలు చాలా ఖరీదైనవి, వాటిని ముట్టుకోవద్దు’ అని ఒకరు కామెంట్ చేశారు. విలువైన టమాటాలకు పాము కాపాలాగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే తమ తమ ప్రాంతాల్లో టమాట ధరలను కొందరు ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

