భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్..!
Amazon | ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా
న్యూఢిల్లీ: ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్నాయి. కొత్త నియామకాలను తగ్గించడంతోపాటు ఉన్నవారిని ఉద్యోగాల్లోనుంచి తీసేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది.

ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వీరంతా సాఫ్ట్వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారని, జనవరి 18 తర్వాత వీరికి ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలైన లింక్డ్ఇన్, ట్విట్టర్ ద్వారా తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తున్నది. కాగా, తాజాగా వేటు పడనున్న ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని ముందుగానే చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. మరిన్ని విషయాలకోసం టీమ్ లీడర్లను కలవాల్సిందిగా మెయిల్స్ పేర్కొంటున్నారు.

ఈ కొత్త సంవత్సరంలో తమ కంపెనీలోని 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్టు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులను నియమించుకొన్నామని, అనిశ్చిత పరిస్థితుల కారణంగా వారిని తొలగిస్తున్నామని తెలిపారు. అమెజాన్ స్టోర్స్, పీఎక్స్‌టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రముఖ టెక్ కంపెనీ ‘సేల్స్‌ఫోర్స్’ కూడా అమెజాన్ బాటలోనే నడుస్తున్నది. ఈ ఏడాది తమ కంపెనీలోని 8 వేల మందిని (10శాతం) ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని కార్యాలయాలను కూడా మూసివేస్తున్నట్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

