న్యూఢిల్లీ: అమెజాన్ సంస్థలో మేనేజర్(Amazon Manager)గా పనిచేస్తున్న 36 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారు. ఢిల్లీలో ఈ మర్డర్ జరిగింది. హర్‌ప్రీత్ గిల్ అనే వ్యక్తిపై అయిదు మంది కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భజన్‌పురా ఏరియాలోని సుభాష్ విహార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ బుల్లెట్ హర్‌ప్రీత్ తలలోకి దూసుకువెళ్లింది. అతను స్పాట్లో మృతిచెందాడు. అతని మిత్రుడు గోవింద్ సింగ్‌కు కూడా ఓ బుల్లెట్ గాయమైంది. ఎల్ఎన్జీపీ హాస్పిటల్లో ప్రస్తుతం సింగ్‌కు చికిత్స జరుగుతోంది. కాల్పులు జరిపిన నిందితులు పరారీలో ఉన్నారు. సీసీటీవీ ఫూటేజ్ ద్వారా నిందితులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.