Amazon | ఈ-కామర్స్ దిగ్గజయం అమెజాన్ (Amazon) మరోసారి డిస్కౌంట్ సేల్‌తో మనముందుకు రానుంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని డిస్కౌంట్ సేల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale) పేరుతో తక్కువ ధరకే అందిచనుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. అయితే ఎప్పుడు ప్రారంభించే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే గతేడాది జనవరి 15న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించింది. అందువల్ల ఇప్పుడు కూడా ఈ నెల 15కు ఒక రోజు అటుఇటూ డిస్కౌంట్ సేల్ మొదలుకానుంది. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి ఒక రోజు ముందుగానే ఇది అందుబాటులోకి వస్తుంది.
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్లు ఉండనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు లాంటి హోమ్ అప్లియెన్సెస్ కూడా డిస్కౌంట్లకు రానున్నాయి. కొన్ని డీల్స్ వివరాలను కూడా అమెజాన్ ఇప్పటికే వెల్లడించింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై (SBI credit card) అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించింది.
ల్యాండింగ్ పేజ్‌లోని వివరాల ప్రకారం స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని పేర్కొంది. అదేవిధంగా ల్యాప్టాలు, స్మార్ట్ వాచ్‌లపై 75 శాతం, స్మార్ట్ టీవీలు, ఇతర గృహ వినియోగ వస్తువులపై 65 శాతం వరకు రాయితీ అందిస్తామని తెలిపింది.