Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికులకు చందర్‌కోట్ వద్ద సాదర స్వాగతం..!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) కు సర్వం సిద్ధమైంది. ఈ యాత్రలో భాగంగా బల్తాల్ మార్గం (Baltal Raod) లో బయల్దేరిన తొలి బృందం యాత్రికులకు ఘన స్వాగతం లభించింది. జమ్మూ-శ్రీనగర్ (Jammu and Srinagar) జాతీయ రహదారిపై ఉన్న రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ (Chanderkote) వద్ద ఏర్పాటు చేసిన లంగర్ (ఉచిత భోజనశాల) వద్ద అధికారులు, స్థానికులు యాత్రికులను సాదరంగా ఆహ్వానించారు.
Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) కు సర్వం సిద్ధమైంది. ఈ యాత్రలో భాగంగా బల్తాల్ మార్గం (Baltal Raod) లో బయల్దేరిన తొలి బృందం యాత్రికులకు ఘన స్వాగతం లభించింది. జమ్మూ-శ్రీనగర్ (Jammu and Srinagar) జాతీయ రహదారిపై ఉన్న రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ (Chanderkote) వద్ద ఏర్పాటు చేసిన లంగర్ (ఉచిత భోజనశాల) వద్ద అధికారులు, స్థానికులు యాత్రికులను సాదరంగా ఆహ్వానించారు. రాంబన్ జిల్లా యంత్రాంగం, పౌర సమాజ ప్రతినిధులు, పలు లంగర్ సంస్థలు కలిసి యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపి, వారి యాత్ర ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఐజీ సర్గున్ శుక్లా, రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ అలియాస్ ఖాన్, ఎస్ఎస్పీ అరుణ్ గుప్తా, ఎస్ఎస్పీ ట్రాఫిక్ రాజా ఆదిల్ హమీద్‌తోపాటు పలువురు సీనియర్ సివిల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం ఉదయం యాత్రికుల కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించిన తర్వాత, చందర్‌కోట్ వారికి మొదటి ప్రధాన విరామ కేంద్రంగా నిలిచింది. యాత్రికులకు ఆహారం, తాగునీరు, ఇతర అత్యవసర సేవలు అందించేందుకు చందర్‌కోట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
యాత్రికుల భద్రత, సంక్షేమం, ప్రయాణం సాఫీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పోలీసు, ఆర్మీ, సీఏపీఎఫ్, ట్రాఫిక్ పోలీసు, ఆరోగ్య శాఖ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సేవలు వంటి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. రాంబన్ జిల్లాకు ఉన్న ఆతిథ్య సంప్రదాయానికి ఈ స్వాగత కార్యక్రమం అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఈ వార్షిక యాత్రను ఒక మధురమైన అనుభూతిగా మార్చడంలో భాగస్వాములందరి సమష్టి నిబద్ధతను ఇది తెలియజేస్తున్నది.
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్ర యాత్రలలో శ్రీ అమర్నాథ్ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను సందర్శిస్తారు. ఇక్కడ సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ మంచు లింగం శివుని ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ ఏడాది 57 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర జూలై 3న అధికారికంగా ప్రారంభమై, రక్షా బంధన్ పర్వదినం రోజున అంటే ఆగస్టు 28న ముగుస్తుంది.
అనంతనాగ్ జిల్లాలోని సంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం, అలాగే గందర్బల్ జిల్లాలోని తక్కువ దూరంతో నిటారుగా ఉండే 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా ఏకకాలంలో యాత్ర కొనసాగుతుంది. యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఆన్‌స్పాట్ రిజిస్ట్రేషన్, ఆర్ఎఫ్ఐడీ కార్డుల జారీ, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి పనులను పూర్తిచేశారు. నివేదికల ప్రకారం.. ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 3.5 లక్షల మందికిపైగా భక్తులు నమోదు చేసుకున్నారు. రద్దీని నియంత్రించేందుకు రోజువారీ యాత్రికుల సంఖ్యపై పరిమితులు విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

