బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్… తన పార్టీని అందులో విలీనం?
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. పంజాబ్ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ (పీఎల్‌సీపీ)ని కూడా బీజేపీలో విలీనం చేయనున్నారు. సంబంధిత వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత అయిన 89 ఏళ్ల అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వెన్నుముఖ శస్త్రచికిత్స కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గత ఆదివారం అమరీందర్‌కు సర్జరీ జరిగింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో ఆయనతో మాట్లాడారు. అమరీందర్ సింగ్ వచ్చే వారం లండన్ నుంచి పంజాబ్‌కు తిరిగి రానున్నారు. అనంతరం ఆయన బీజేపీలో చేరడంతోపాటు తన పార్టీ పీఎల్సీపీని బీజేపీలో విలీనం చేయనున్నారు.
కాగా, 50 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి మూడు సార్లు సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్‌ను గత ఏడాది సీఎం పదవి నుంచి కాంగ్రెస్ మార్చింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ (పీఎల్‌సీపీ)ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్ అయినా దక్కలేదు.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల తర్వాత పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో అమరీందర్ సింగ్ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆయన భార్య ప్రణీత్ కౌర్ పాటియాలా కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే తన కుమార్తె జై ఇందర్ కౌర్‌కు ఈ స్థానంలో అవకాశం ఇవ్వాలని బీజేపీని ఆమె కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

